Sri Seetharamula Kalyanam on
April 15, 2016 in Bhadrachalam
The Sri Sita Ramachandra Swamy temple at Bhadrachalam, is the most famous temple in India dedicated to Lord Rama and is situated on the left bank of the Godavari river. It is a place of pilgrimage for Hindus, considered to be one of the greatest holy shrines in South India with a very rich and unique historical background. The puranic and historic facts relate that Lord Rama long after he had shed his mortal coils manifested himself to save his devotee Bhadra Maharshi whom he promised ‘moksha’ after intensive prayer. Every year during the month of Chaitra, on the auspicious Navami the Kalyanamahotsavam of Sri Rama with his consort Sita is celebrated in a resplendent manner.
భద్రాచల రామయ్య పెండ్లికి ముహూర్తం ఖరారైంది. శ్రీ సీతారాముల కల్యాణం ఏప్రిల్ 15న జరగనుంది. ఈ మేరకు వైదిక కమిటీ నిర్ణయం తీసుకుంది. శ్రీరామనవమిని పురస్కరించుకొని తిరు కల్యాణ బ్రహోత్సవాల షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది.
ఏప్రిల్ 8 నుంచి 21వ తేదీ వరకు వసంతపక్ష ప్రయుక్త నవాహ్నిక శ్రీరామనవమి తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.
ఏప్రిల్8న ఉగాది పండుగను పురస్కరించుకొని నూతన పంచాంగ శ్రవణం జరుపుతారు.
11న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ,
13న అగ్నిప్రతిష్ట, ధ్వజారోహనం,
14న ఎదుర్కోలు ఉత్సవం,
15న శ్రీసీతారాముల కల్యాణం,
16న మహాపట్టాభిషేకం,
17న సదస్యం,
21న ధ్వజారోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో నిర్వహించనున్న శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని మార్చి10న కలెక్టర్ లోకేష్‌కుమార్ అధ్యక్షతన భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సమీక్ష సమావేశం జరగనున్నట్లు సమాచారం. ఉత్సవాలకు ముందు మూడు సార్లు అధికారులు సమీక్ష సమావేశాలు జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో తొలి సమావేశం మార్చి 10న జరపాలని జిల్లా అధికార యంత్రాంగం సమాలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. స్థానిక చిత్రకూట మండపంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారం త్వరలోనే జిల్లా, డివిజన్, మండల అధికారులకు సమాచారం అందనుంది. ప్రతీఏటా భద్రాచలంలో ముక్కోటి, శ్రీరామనవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈఏడాది ముక్కోటి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. అలాగే శ్రీరామనవమి ఉత్సవాలను కూడా వైభవోపేతంగా నిర్వహించేందుకు లయ కమిటీ నిశ్చయించుకుంది.
భద్రాద్రి శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. దర్బారుసేవ ఘనంగా నిర్వహించారు. వెండిరథ సేవ భక్తులను మంత్రముగ్ధుల్ని చేసింది. ఉదయం బేడా మండపంలో ప్రవర, కన్యాదానం, మంగల్యధారణ నిర్వహించి సీతారాముల వారికి నిత్యకల్యాణం జరిపించారు. స్వామివారికి భక్తులు కట్నకానుకలు సమర్పించారు. చిత్రకూటమండపంలో శ్రీరామాయణ మహాక్రతువు వైభవంగా నిర్వహించారు. రామాయాణంలోని కాండలను పఠించారు. శ్లోకాలు చదువుతూ హోమం జరిపించారు. నేడు రామాలయంలో శుక్రవారోత్సవం జరుగుతుందని ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు తెలిపారు.
భద్రాద్రి రామాలయాన్ని ఏపీలోని విజయవాడకు చెందిన భక్తులు గురువారం దర్శించుకొన్నారు. వజ్రాల శివకుమార్, మాధురి కుటుంబసభ్యులతో వచ్చిస్వామిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం అన్నదానం నిమిత్తం రూ.లక్ష విరాళం ఇచ్చారు. ఈ మొత్తాన్ని డీడీ రూపంలో పీఆర్వో సాయిబాబు చేతుల మీదుగా స్వామివారి ఖాతాలో జమచేశారు.